భాగమతి తర్వాత అనుష్క మరోటి..!

July 19, 2018


img

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క కమర్షియల్ సినిమాలతో పాటుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ వచ్చింది. అరుంధతి నుండి భాగమతి వరకు అనుష్క ప్రయోగాలన్ని సక్సెస్ అనే చెప్పాలి. ఈ ఇయర్ భాగమతితో హిట్ అందుకున్న అనుష్క ప్రస్తుతం చద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో సినిమా చేయబోతుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుందట. ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని కూడా నటిస్తాడని టాక్.

ఇక ఈ సినిమాతో పాటుగా మరో ఫీమేల్ లీడ్ సినిమాకు సైన్ చేసిందట స్వీటీ అనుష్క. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన ఎల్.ఏ సంస్థ తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారట. వారు ఆల్రెడీ కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' నిర్మాణంలో భాగమయ్యారు. కాని ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అందుకే రెండో ప్రయత్నంగా అనుష్కతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. ఇదే కాకుండా ఓ మాస్ అండ్ కమర్షియల్ మూవీ తీసే ఆలోచనలో ఉన్నారట ఎల్.ఏ నిర్మాతలు. Related Post

సినిమా స‌మీక్ష