ఆమెను రిపీట్ చేస్తున్న మహేష్..!

July 18, 2018


img

భరత్ అనే నేను తర్వాత మహేష్ 25వ సినిమాగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడట. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఆ సినిమా రాబోతుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. మహేష్ తో రకుల్ మురుగదాస్ స్పైడర్ సినిమాలో జతకట్టింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన స్పైడర్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయినా సరే మహేష్ మళ్లీ రకుల్ తో రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పాడు. రంగస్థలంతో సుకుమార్ సక్సెస్ ట్రాక్ ఎక్కగా మహేష్ తో సినిమా ఏం చేస్తాడో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష