వైల్డ్ కార్డ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది..!

July 18, 2018


img

బిగ్ బాస్ సీజన్ 2 నాని హోస్ట్ గా శని ఆదివారాలు పిట్టకథలతో అలరిస్తుంటే.. వారం మొత్తం హౌజ్ మెట్స్ తమ గొడవలతోనే షో రన్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ టాస్క్ లో కౌశల్ మీద ఎటాక్ చేసిన భాను, తేజశ్విలకు నాని క్లాస్ పీకగా ఈవారం అంతా కూల్ గానే నడుస్తుంది. ఇక నిన్న సినిమా టాస్క్ లో భాగంగా అందరు నటులే కావడం చేత బాగా టాస్కుకు బాగా కనెక్ట్ అయ్యారు.

మరోపక్క కొద్దిరోజులుగా బిగ్ బాస్-2లో ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హెబ్భా పటేల్ వస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. మొదటి సీజన్ లో దీక్షా పంథ్, నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు అదే క్రమంలో హెబ్భా బిగ్ బాస్ లోకి వస్తుందని అన్నారు. కాని ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. స్వయంగా హెబ్భా పటేల్ బిగ్ బాస్-2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తాను వెళ్తునానని వస్తున్న వార్తలని ఖండించింది. ఏ రియాలిటీ షో వారు తనని సంప్రదించలేదని ఏలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలను ఎలా రాస్తారంటూ అసంతృప్తి వ్యక్తపరచింది హెబ్భా.



Related Post

సినిమా స‌మీక్ష