వీర రాఘవ హైలెట్ సీన్స్..!

July 18, 2018


img

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అక్టోబర్ 10న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ హైలెట్ కానున్నాయట. తెలుస్తున్న సమాచారం ప్రకారం సింహాద్రి రేంజ్ లో అద్భుతమైన ట్విస్టులతో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అరవింద సమేతలో ఉంటాయని అంటున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ కు పండుగ తీసుకురావడం ఖాయమని తెలుస్తుంది. ఈసారి దసరా బరిలో పోటీ రసవత్తరంగా మారనుంది. ఎన్.టి.ఆర్ తో రామ్, విశాల్, విక్రం సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఏ సినిమా విజయపతాకం ఎగురవేస్తుందో చూడాలి.   



Related Post

సినిమా స‌మీక్ష