దిల్ రాజుతో గొడవేంటి హరీశా..!

July 18, 2018


img

నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తనకు నచ్చిన దర్శకుడిని అసలు వదిలిపెట్టడు. ఇప్పటికి కొందరు దర్శకులు అతని బ్యానర్ లోనే వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ దిల్ రాజు బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ వచ్చారు. వంశీ పైడిపల్లి మధ్యలో బయట నిర్మాలు చేశాడు కాని హరీష్ శంకర్ మాత్రం దిల్ రాజు బ్యానర్ లోనే వరుసగా మూడు సినిమాలు చేశాడు. 

లాస్ట్ ఇయర్ డిజే మంచి ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ ఓ క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడని తెలిసిందే. దాగుడుమూతలు అని టైటిల్ కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు. కాని సినిమా మాత్రం పట్టాలెక్కడం లేదు. నాని, శర్వానంద్ తో దిల్ రాజు బ్యానర్ లో ఆ సినిమా తీయాలని చూశాడు హరీష్ శంకర్ కాని ఆ ప్రాజెక్ట్ విషయంలో దిల్ రాజు ఆ కథను ఫన్ ఫిల్డ్ గా తీద్దామని పట్టుబడితే.. హరీష్ శంకర్ మాత్రం ఎమోషనల్ డ్రామాగా తీయాలని అంటున్నాడట.

ఈ డిస్కషన్స్ వల్ల హరీష్ దిల్ రాజు బ్యానర్ నుండి బయటకు వచ్చాడని తెలుస్తుంది. సొంతంగా నిర్మించే ఆలోచనలో ఉన్నాడట. చూస్తుంటే దిల్ రాజు కాదన్న సబ్జెక్ట్ సినిమా తీసి హిట్ కొట్టాలన్న కసి హరీష్ శంకర్ లో కనిపిస్తుందట. మరి నిజంగానే ఈ మ్యాటర్ లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.



Related Post

సినిమా స‌మీక్ష