మ్యూజిక్ డైరక్టర్ హీరో అవుతున్నాడు..!

July 17, 2018


img

మళయాల మ్యూజిక్ డైరక్టర్ గోపి సుందర్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇన్నాళ్లు తన సంగీతంతో ప్రేక్షకులను అలరించిన గోపి సుందర్ హీరోగా టోల్ గేట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం గోపి సుందర్ తన లుక్ కూడా మార్చుకున్నాడు. ఇప్పటికే తమిళ మ్యూజిక్ డైరక్టర్ జివి ప్రకాశ్ హీరోగా టర్న్ అవగా.. విజయ్ ఆంటోనీ కూడా హీరోగా మారి తన మార్క్ సినిమాలు చేస్తున్నాడు.   


దేవి శ్రీ ప్రసాద్ కూడా హీరోగా చేస్తాడని ఎప్పటి నుండో అనుకుంటున్నా అది మాత్రం జరగట్లేదు. ఇప్పుడు గోపి సుందర్ కూడా హీరోగా తన అదృష్టాన్ని పరిక్షీంచుకోనున్నాడు. రియల్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాను హరికృష్ణన్ డైరెక్ట్ చేస్తుండగా.. హజీనా సలాం నిర్మిస్తున్నారు. తెలుగులో మ్యూజిక్ డైరక్టర్ గా ఇప్పటికి సూపర్ ఫాంలో ఉన్న గోపి సుందర్ హీరోగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.       



Related Post

సినిమా స‌మీక్ష