చినబాబు రివ్యూ & రేటింగ్

July 13, 2018


img

రేటింగ్ : 2.25/5 

కథ :

రుద్రరాజు (సత్యరాజ్) కు ఐదుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన కృష్ణం రాజు (కార్తి) అంటే చాలా ఇష్టం. రైతుగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న కృష్ణం రాజుకి నీరజ (సయేషా సైగల్) నచ్చుతుంది. ఆల్రెడీ ఇద్దరు మేనకోడళ్లులో ఒకరిని చినబాబుకి ఫిక్స్ అవగా అతను వేరొకరిని ఇష్టపడటం ఫ్యామిలీలో గొడవలకు దారి తీస్తుంది. ఆ గొడవని ఇంకాస్త పెంచుతాడు నీరజ బావ సురేందర్ రాజు (శత్రు). ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఫ్యామిలీ చిన్నాభిన్నం అవుతుంది. మరి ఈ తరుణంలో చినబాబు ఏం చేశాడు. కుటుంబంలో అందరిని ఎలా కలిపాడు అన్నది సినిమా కథ.  

విశ్లేషణ :

హీరో రైతుగా నటించడం అనేది చాలా మంచి పాయింట్. రైతుల గొప్పతనం గురించి చాలా అద్భుతంగా డైలాగ్స్ ద్వారా వినిపించాడు దర్శకుడు పాండిరాజ్. అయితే సినిమాలో కాస్త సెంటిమెంట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మొదటి భాగం కార్తి మార్క్ ఎంటర్టైనింగ్ తో నడిపించినా సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ గా నడిపించాడు.

అయితే చాలా చోట్ల తమిళ నేటివిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకే తెలుగు ఆడియెన్స్ కు కాస్త విసుగు తెప్పిస్తుంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో కొన్ని చోట్ల తమిళ బోర్డులు ఉంచేశారు. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ సాగదీతగా ఉంటుంది. అయితే క్లైమాస్ మళ్లీ అందరిని మెప్పించాడు పాండిరాజ్.

హీరో రైతుగా నటించి రైతు సమస్యలు.. రాజకీయ నాయకుల పద్ధతి లాంటివి తీస్తే బెటర్ కాని కేవలం కుటుంబ కలహాల చుట్టూ సినిమా నడిపించడం ఆడియెన్స్ ను మెప్పించలేదు. ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నా సినిమా యూత్ ఆడియెన్స్ కు మాత్రం ఎక్కే అవకాశం లేదు.

నటన, సాంకేతికవర్గం :

కార్తి రైతుగా నటించి సాహసం చేశాడని చెప్పొచ్చు. స్టార్ ఇమేజ్ ఉన్న కార్తి ఫార్మర్ గా భలే అనిపించాడు. సయేషా సైగల్ కొద్ది పాత్రే అయినా బాగానే నటించింది. సత్యరాజ్ మంచి పాత్రలో నటించి మెప్పించాడు. విలన్ గా శత్రు ఇంప్రెస్ చేశాడు. సపోర్టింగ్ రోల్స్ చేసే శత్రుకి మెయిన్ విలన్ గా ప్రమోట్ చేయడం మంచి విషయం. మిగతా పాత్రలన్ని తమిళ నటులే చేయడం జరిగింది.  

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. ఇమ్మాన్ మ్యూజిక్ జస్ట్ ఓకే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సాదాసీదాగా ఉంది. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని అందంగా చూపించారు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిం చేస్తే బాగుండేది. కథ, కథనాల్లో కొత్తదనం లేకున్నా కార్తిని రైతుగా చూపించి మెప్పించాడు. ఈ సినిమాకు సూర్య నిర్మాత. అందుకే ఎడ్ల బంది పందెంలో తళక్కున మెరిసి అలరించాడు.

ఒక్కమాటలో :

సెంటిమెంట్ డోస్ ఎక్కువైన కార్తి 'చినబాబు'..!



Related Post

సినిమా స‌మీక్ష