బిగ్ బాస్-2 వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆ బ్యూటీ..!

July 11, 2018


img

నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఇప్పుడిప్పుడే ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచుతుంది. నెల రోజులు ముగిశాక ఈ షో మంచి రసవత్తరంగా మారింది. ప్రేమ జంటలు.. పగలు.. ప్రతికారాలతో హౌజ్ లో కంటెస్టంట్స్ అదరగొడుతున్నారు. ఇక వైల్డ్ కార్డ్ గా మొదటి వారంలో ఎంట్రీ ఇచ్చిన నందిని ఏమంత కిక్ ఇవ్వట్లేదు. అందుకే ఇప్పుడు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని హౌజ్ లోకి పంపించే ఏర్పాటుచేస్తున్నారట.

మొదటి సీజన్ లో దీక్షా పంథ్ మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చింది. ఆ తర్వాత నవదీప్ వచ్చాడు. ఈ సీజన్ లో మొదటిగా హెబ్భా పటేల్ ఆ ఛాన్స్ కొట్టేసిందట. కుమారి 21ఎఫ్ తో కుర్రకారిని గిలిగింతలు పెట్టిన హెబ్భా పటేల్ బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందట. మొదట్లో ప్రగ్యా జైశ్వాల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందని వార్తలు రాగా ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లే హీరోయిన్ హెబ్భానే అంటున్నారు. Related Post

సినిమా స‌మీక్ష