ఎన్టీఆర్ పోటీగా రామ్..!

July 11, 2018


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా బరిలో దించుతున్నారట. అక్టోబర్ 10, 11 తేదీలలో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు పోటీగా ఇప్పటికే నాని, నాగార్జుల మల్టీస్టారర్ మూవీ దేవదాస్ వస్తుందని అంటుండగా ఇప్పుడు మరో సినిమా యాడ్ అయ్యింది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో గురు ప్రేమ కోసమే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ కు పోటీగా దేవదాస్ తో పాటుగా రామ్ కూడా తన సినిమాను వదులుతున్నాడు. మరి ఈ సినిమాల్లో ఏది సూపర్ హిట్ అవుతుందో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష