బన్ని డబుల్ ధమాకా..!

July 11, 2018


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నిరాశపరచగా తన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు బన్ని. తెలుస్తున్న సమాచారం ప్రకారం విక్రం కుమార్ తో సినిమా చేస్తాడని టాక్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుందట. ఇష్క్, మనం, 24 సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్రం కుమార్ బన్నితో క్రేజీ కాన్సెప్ట్ తో మూవీ చేస్తున్నాడట. 

ఈ సినిమాలో బన్ని డ్యుయల్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్ కు ఈసారి అల్లు అర్జున్ డబుల్ ధమాకా ఇవ్వనున్నాడని తెలుస్తుంది. నా పేరు సూర్య తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న బన్ని, విక్రంతో ఎలాంటి మూవీ చేస్తాడో చూడాలి. ఈ సినిమా తర్వాత బన్ని లింగుసామి డైరక్షన్ లో మూవీ చేస్తాడని అంటున్నారు.  Related Post

సినిమా స‌మీక్ష