కార్తి ఖాకీ సీక్వల్ ప్లాన్..!

July 11, 2018


img

కార్తి హీరోగా పి.ఎస్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఖాకీ. లాస్ట్ ఇయర్ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ అందుకుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో పోలీస్ పవర్ ఏంటో మరోసారి చూపించారు. తమిళంతో పాటుగా తెలుగులో కూడా మార్కెట్ పెంచుకున్న కార్తి అక్కడ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. 

ఈ శుక్రవారం చినబాబుగా రాబోతున్న కార్తి త్వరలోనే ఖాకీ సీక్వల్ కు సిద్ధమవుతున్నట్టు చెప్పాడు. ఆల్రెడీ వినోద్ ఖాకీ సీక్వల్ లైన్ చెప్పడం దానికి కార్తి ఓకే చెప్పడం జరిగిందట. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఖాకీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా సీక్వల్ అంటే తెలుగు ఆడియెన్స్ కూడా ఎక్సైటింగ్ గా ఉన్నారు. మరి కార్తి తర్వాత సినిమా అదో కాదో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాలి.  Related Post

సినిమా స‌మీక్ష