2.ఓ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా వస్తుందా..!

July 11, 2018


img

రోబో సీక్వల్ గా శంకర్ తలపెట్టిన 2.ఓ చాలాసార్లు రిలీజ్ వాయిదా వేస్తూ వచ్చారు. అనుకున్న బడ్జెట్ డబుల్ అవడంతో పాటుగా అంచనాలు కూడా పెరగడంతో సినిమాపై ఇంకాస్త గురి పెడుతున్నాడు శంకర్. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా 2017 లోనే రిలీజ్ కావాల్సి ఉన్నా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ అవుతూ వచ్చింది. దానితో రిలీజ్ కూడా వాయిదాలు వేస్తూ వచ్చారు.

అసలైతే ఈ ఇయర్ సమ్మర్ లో 2.ఓ వస్తుందని భావించినా ఆ తర్వాత రజిని నటించిన కాలా వచ్చింది కాని 2.ఓ మాత్రం రిలీజ్ కాలేదు. షూటింగ్ ఎప్పుడో పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ పడ్డదట. ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడు దర్శకుడు శంకర్. నవంబర్ 29న 2.ఓ రిలీజ్ అని ఆయన ప్రకటించారు. మరి ఈసారైనా చెప్పిన డేట్ కు వస్తుందా రాదా అన్నది చూడాలి. మేకింగ్ వీడియో చూస్తే హాలీవుడ్ సినిమాలకు ధీటుగా 2.ఓ వస్తుందని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష