కళ్యాణ్ దేవ్ 'విజేత' కాదు..!

July 10, 2018


img

మెగాస్టార్ చిన్నళ్లుడు కళ్యాణ్ హీరోగా రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న సినిమా విజేత. వారాహి చలనచిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా కథ ముందు కళ్యాణ్ కోసం రాసుకోలేదట రాకేష్ శషి. జతకలిసే సినిమా తీసిన ఈ దర్శకుడు ఆ సినిమా రిలీజ్ టైంలో సాయి కొర్రపాటితో పరిచయం ఏర్పడిందట. ఈ కథ చెప్పినప్పుడు కళ్యాణ్ తో చేస్తే బాగుంటుందని ఆయనే సూచించారట.

కళ్యాణ్ కలిసిన తర్వాత ఈ కథకు తాను పర్ఫెక్ట్ అనిపించింది. అయితే సినిమాలో హీరో పాత్రకు కళ్యాణ్ రియల్ లైఫ్ కు ఏమాత్రం సంబంధం లేదు. కళ్యాణ్ బాగా డబ్బున్న కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. అయితే ఇందులో మధ్యతరగతి వ్యక్తిగా నటించాల్సి ఉంది. అందుకు తగినట్టుగా కళ్యాణ్ చాలా బాగా చేశారు. సినిమా కథ కొత్తగా ఉంటుందని చెప్పను కాని తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పాడు విజేత దర్శకుడు. ఈ గురువారం రిలీజ్ అవుతున్న విజేత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.   Related Post

సినిమా స‌మీక్ష