బాహుబలి తర్వాత ట్రిపుల్ ఆర్..!

July 10, 2018


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా మరో క్రేజీ ప్రాజెక్ట్ అవనుందని తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ మూవీపై అందరి దృష్టి ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 250 నుండి 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. చూస్తుంటే ఇది మరో బాహుబలి అవనుందని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమా మొదట తెలుగు, తమిళ భాషల్లో తీయాలని అనుకోగా బడ్జెట్ ఎక్కువవడంతో హిందిలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దానికోసం మళ్లీ కరణ్ జోహార్ తోనే డీల్ సెట్ చేసుకుంటున్నారట. బాహుబలి సినిమా హిందిలో ఆ రేంజ్ ప్రచారం అందుకుంది అంటే అది కచ్చితంగా కరణ్ జోహార్ వల్లే. బాహుబలి మొదటి రెండు పార్టులతో కరణ్ జోహార్ కూడా భారీ లాభాలు పొందాడు.  

ప్రస్తుతం బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ మల్టీస్టారర్ కూడా హిందిలో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. నవంబర్ లో మొదలవనున్న ఈ సినిమా 2020లో రిలీజ్ ప్లాన్ చేస్తారట. Related Post

సినిమా స‌మీక్ష