ఐటం నంబర్ లో రకుల్..!

June 23, 2018


img

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో సినిమా అవకాశాలు లేక ఐటం గాళ్ గా మారిందా అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాల వారు. హీరోయిన్స్ ఈమధ్య స్పెషల్ సాంగ్స్ వేయడం అలవాటుగా మార్చుకున్నారు. కాజల్, తమన్నా స్పెషల్ సాంగ్ వేస్తూ అలరిస్తుంటే వారి దారిలో ఇప్పుడు రకుల్ కూడా వచ్చి చేరింది. ఐటం సాంగ్ లో రకుల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. 

ఇంతకీ రకుల్ ఎవరికోసం ఐటంగా మారుతుంది అంటే మెగా పవర్ స్టార్ రాం చరణ్ కోసమని తెలుస్తుంది. బోయపాటి శ్రీను డైరక్షన్ లో రకుల్ చేస్తున్న సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక స్పెషల్ సాంగ్ కోసం రకుల్ ను సంప్రదించారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐటం సాంగ్ కోసం రకుల్ కు భారీగానే ముట్టచెబుతున్నారట. మరి ఐటం నంబర్ గా రకుల్ ఎలా అదరగొడుతుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష