జంబ లకిడి పంబ రివ్యూ & రేటింగ్

June 22, 2018


img

రేటింగ్ : 2/5

కథ :

వరుణ్ (శ్రీనివాస్ రెడ్డి), పల్లవి (సిద్ధి ఇద్నాని) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన తర్వాత ఇద్దరికి తరచు గొడవలు అవుతుంటాయి. ఇద్దరు ఒకరితో ఒకరు పోట్లాడుకోలేక విడిపోదామని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ (పోసాని కృష్ణ మురళి) ను కలుస్తారు. తన సర్వీస్ లో 99 జంటలకు విడాకులు ఇచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్ వరుణ్, పల్లవిలకు విడాకులు ఇప్పించాలని నిర్ణయించుకుంటాడు. ఈ టైంలో అతను చనిపోవడం.. ఆ తర్వాత వరుణ్, పల్లవిల ఆత్మలు మారడం జరుగుతుంది. ఫైనల్ గా ఆ ఇద్దరు కలిసి ఉన్నారా లేదా అన్నది సినిమా కథ. 

విశ్లేషణ :

1993లో వచ్చిన సూపర్ క్లాసిక్ మూవీ జంబ లకిడి పంబ. ఈవివి డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఆ టైటిల్ తో ఈవీవీ వారసుడు శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రయత్నం జంబ లకిడి పంబ. కథ, కథనాల్లో దర్శకుడు ఏమాత్రం తన ప్రతిభ కనబరచలేదు. సినిమా అంతా కామెడీగా నడుస్తుందని ఊహించి వచ్చిన ఆడియెన్స్ కు హర్రర్, థ్రిల్లర్ అంశాలు షాక్ ఇస్తాయి. 

ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథనాలు బోర్ కొట్టిస్తాయి. వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ వర్క్ అవుట్ కాలేదు. మొదటి భాగం సరిగా ఎంటర్టైన్ చేయదు సెకండ్ హాఫ్ కామెడీకి స్కోప్ ఉన్నా సరే దర్శకుడు వాడుకోలేదు. క్లైమాక్స్ కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు. 

నటన, సాంకేతికవర్గం :

శ్రీనివాస్ రెడ్డి నటన ఆకట్టుకుంటుంది.. ముఖ్యంగా అమ్మాయి ఆత్మ దూరిన తర్వాత లేడీగా తన ప్రవర్తన చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇలాంటి పాత్ర చేయడానికి అతను ఏమాత్రం సిగ్గు పడలేదని చెప్పొచ్చు. హీరోయిన్ సిద్ధు ఇద్నాని పాత్ర కూడా బాగుంది. మొదటి సినిమానే అయినా బాగానే చేసింది. వెన్నెల కిశోర్ కామెడీ పర్వాలేదు. పోసాని పాత్ర అలరిస్తుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గోపి సుందర్ మ్యూజిక్ సినిమాకు అంతగా హెల్ప్ అవలేదు. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. కథ, కథనాల్లో దర్శకుడు పనితనం అంత గొప్పగా లేదు. బలం లేని కథ.. దానికి అంతకంటే బలహీనమైన కథనంతో ఈ సినిమా తీశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.  

ఒక్కమాటలో :

జంబ లకిడి పంబ.. టైటిల్ కు తగిన న్యాయం జరుగలేదు..! 

 



Related Post

సినిమా స‌మీక్ష