శ్రీరెడ్డి ఇష్యూపై సురేష్ బాబు కామెంట్..!

June 21, 2018


img

దగ్గుబాటి ఫ్యామిలీ మీద శ్రీరెడ్డి సంచలనం అందరికి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ అంటూ అభిరాంతో దిగిన సెల్ఫీస్ లీక్ చేసిన శ్రీరెడ్డి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం మ్యాటర్ డైవర్ట్ అయ్యింది. దగ్గుబాటి ఫ్యామిలీ మీద శ్రీరెడ్డి గురి ఇండస్ట్రీని షాక్ అయ్యేలా చేసింది. ఈ విషయం గురించి సురేష్ బాబు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

ఫైనల్ గా శ్రీరెడ్డి ఇష్యూ మీద పేరు ప్రస్థావించకుండా మాట్లాడేశాడు సురేష్ బాబు. తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో ఈనగరానికి ఏమైంది సినిమా నిర్మాతగా సురేష్ బాబు ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో శ్రీరెడ్డి కామెంట్స్ మీద వివరణ ఇచ్చుకున్నారు. నా వ్యక్తిగత విషయాలను నేను బయటకు పంచుకోను.. నాపై ఏదైనా వ్యక్తిగతంగా ప్రభావం చూపితే అది తన వ్యక్తిగత సమస్య అలాంటి సమస్యను తానే సొంతంగా పరిష్కరించుకుంటానని ఆ విషయాలను ప్రజలతో పంచుకోవలనే ఆసక్తి తనకు లేదని అన్నారు సురేష్ బాబు. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. నా సమస్య గురించి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు.  

ప్రతి చిన్న విషయానికి ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారని.. ఇండస్ట్రీ సాఫ్ట్ కార్నర్ అయ్యిందని అన్నారు సురేష్ బాబు. పనిలో పనిగా చికాగో సెక్స్ రాకెట్ మీద తన అభిప్రాయాన్ని బయటపెట్టారు సురేష్ బాబు. అసలు ఆయన నిర్మాతనా కాదా.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉన్నాడా లేడా అన్నది తెలియకుండా మీడియా ఇష్టం వచ్చినట్టు వార్తలను రాస్తుందని అన్నారు.Related Post

సినిమా స‌మీక్ష