నాని బిగ్ బాస్ అదరగొట్టాడు..!

June 21, 2018


img

బిగ్ బాస్ హోస్ట్ గా నాని అంతగా ఆకట్టుకోవట్లేదు అన్నది ఆడియెన్స్ టాక్. కాని అసలు విషయం ఏంటన్నది మాత్రం టి.ఆర్.పి రేటింగ్స్ వస్తేనే కాని అర్ధం కాలేదు. దాదాపు ఎన్.టి.ఆర్ కు ఈక్వల్ గా నాని బిగ్ బాస్ సీజన్ 2 టి.ఆర్.పి రేటింగులు రావడం ఆశ్చర్యకరంగా ఉంది. ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ 16.18 పాయింట్స్ తో స్టార్ మాని నంబర్ 1 గా నిలబెట్టగా నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్-2 15 పాయింట్స్ రాబట్టింది.

తారక్ తో పోల్చుకుంటే నాని రేంజ్ కాస్త తక్కువే.. అయినా సరే బిగ్ బాస్ సీజన్ 2 టి.ఆర్.పి రేటింగ్స్ లో నాని అదరగొడుతున్నాడు. కంటెస్టంట్స్ కూడా ఎవరెలా అన్నది ఆడియెన్స్ కు అర్ధమవుతుంది. తారక్ తో పోటీగా నాని షో రేటింగు రాబట్టడం గొప్ప విషయమే అని చెప్పొచ్చు. చిన్నగా ఆడియెన్స్ అందరు బిగ్ బాస్ 2కు అలవాటు పడుతున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష