ఇలియానా ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

June 21, 2018


img

గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో మంచి ఫాంలో ఉన్నప్పుడే బాలీవుడ్ నుండి ఓ ఛాన్స్ రాగానే అక్కడకు జంప్ అయ్యింది. బర్ఫీ సినిమాతో అమ్మడు బీ టౌన్ లోకి అడుగుతుపెట్టింది. అయితే అక్కడ ఎలాగు స్టార్ క్రేజ్ వస్తుందని ఊహించిన ఇల్లి బేబ్ సౌత్ సినిమాలను చిన్న చూపు చూసింది. ఆ టైంలో వచ్చిన తెలుగు సినిమాల అవకాశాలను కాదంది ఇలియానా. 

అయితే అక్కడ అమ్మడి సీన్ రివర్ అయ్యింది. అనుకున్న రేంజ్ అందుకోలేకపోయింది. కొన్నాళ్లు తెలుగు దర్శక నిర్మాతలు ఆమెని దూరం పెట్టారు. ఫైనల్ గా శ్రీను వైట్ల డైరక్షన్ లో రవితేజ చేస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇలియానా ఛాన్స్ పట్టేసింది. ఆ సినిమా సెట్స్ లోకి అమ్మడు ఎంట్రీ ఇచ్చిందట. తెలుగులో మళ్లీ మునుపటి క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్న ఇలియానా ఇన్నాళ్లకు ఒక లక్కీ ఛాన్స్ అందుకుంది.  



Related Post

సినిమా స‌మీక్ష