సైరా స్పీడ్ పెంచారు.. కారణం అదేనా..!

June 18, 2018


img

ఖైది నంబర్ 150 తవాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో సైరా నరసింహారెడ్డి మూవీ మొదలు పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. నిన్నటిదాకా సినిమాకు తొందరేం లేదు అనుకున్న విధంగా పర్ఫెక్ట్ గా రావాలని చిరు లేట్ చేశాడు. కాని సడెన్ గా సైరా యూనిట్ కు స్పీడ్ పెంచమని చెప్పాడట.    

ఎట్టి పరిస్థితుల్లో తన పోర్షన్ మొత్తం డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఆర్డర్స్ వేశాడట. సైరా తర్వాత కొరటాల శివతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు చిరంజీవి. డిసెంబర్ నుండి ఆ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. అందుకే ఎలాగైనా సైరాని అనుకున్న టైం కల్లా పూర్తి చేయాలని చెప్పాడట. 2019 సమ్మర్ కల్లా సైరా రిలీజ్ అవుతుంది. అప్పటికల్లా కొరటాల శివ మూవీని కూడా సగనికి పైగా పూర్తి చేయాలని చిరు ఆలోచన. 2019 దసరాకి కొరటాల శివ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష