శేఖర్ కమ్ములతో బన్ని..!

June 18, 2018


img

నా పేరు సూర్య తర్వాత బన్ని చేసే సినిమా ఏంటన్న కన్ ఫ్యూజన్ కు క్లారిటీ రాలేదు సరికదా కొంత కాంబినేషన్స్ తో ఇంకా డౌట్లు పెంచుతున్నారు. ప్రస్తుతం హాలీడేస్ లో ఉన్న బన్ని రాగానే ముందు తన దర్శకుడిని ఫైనల్ చేస్తాడని అంటున్నారు. అయితే నిన్నటి దాకా విక్రం కె కుమార్ డైరక్షన్ లో బన్ని సినిమా ఉంటుందని అంటుండగా లేటెస్ట్ గా కూల్ అండ్ క్లాస్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరక్షన్ లో బన్ని నటిస్తాడని అంటున్నారు.

ఆనంద్ నుండి ఫిదా వరకు శేఖర్ కమ్ముల సినిమా అంటే యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఫిదాతో మళ్లీ తన సత్తా చాటిన శేఖర్ కమ్ముల బన్నికి ఇమేజ్ కు సరితూగే కథ సిద్ధం చేశాడట. బన్నికి లైన్ వినిపించాడట కూడా. హాలీడేస్ పూర్తి చేసుకుని రాగానే బన్ని ఓకే అంటే సెట్స్ మీదకు వెళ్లడమే అని తెలుస్తుంది. చూస్తుంటే బన్ని, కమ్ముల ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల అందించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష