ఎన్టీఆర్ సినిమాకు బాలకృష్ణ సెంటిమెంట్..!

June 18, 2018


img

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తేజ డైరక్షన్ లో మొదలైన ఈ సినిమా ఇప్పుడు క్రిష్ చేతుల్లోకి వచ్చింది. ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రగా అన్ని విషయాల గురించి ఈ సినిమాలో ప్రస్థావించడం జరుగుతుందని తెలుస్తుంది. సినిమాలో బాలకృష్ణ 53 గెటప్పులలో కనిపిస్తారట. క్రిష్ టేకప్ చేసిననాటి నుండి బయోపిక్ స్పీడందుకుంది.

ఇక ఈ సినిమా అసలైతే ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని ఇప్పుడు ఫైనల్ గా 2019 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారట. బాలకృష్ణ 100వ సినిమాగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా క్రిష్ డైరక్షన్ లోనే తెరకెక్కింది.  ఆ సినిమా కూడా సంక్రాంతికి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ సెంటిమెంట్ మాత్రమే కాదు సంక్రాంతి అంటే బాలయ్య సినిమా సందడి ఉండాల్సిందే. పొంగల్ వార్ లో బాలయ్య మ్యాక్సిమం హిట్లు కొట్టారు అందుకే ఎన్.టి.ఆర్ సినిమాను జనవరి 9న రిలీజ్ చేయాలని చూస్తున్నారట.



Related Post

సినిమా స‌మీక్ష