మళ్లీ సొంత ప్రయత్నం చేస్తున్న పూరి..!

June 16, 2018


img

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ గా ఇండస్ట్రీ హిట్లు సైతం కొట్టిన పూరి జగన్నాథ్ హిట్ కోసం తహతహలాడుతున్నాడు. తనయుడు హీరోగా చేసిన మెహబూబా కూడా ఫ్లాప్ అవడంతో డీలా పడ్డ పూరి కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ సినిమాకు సిద్ధమయ్యాడు. ఈసారి ఒకటి కాదు రెండు సినిమాలను వెంట వెంటనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. అది కూడా పూరి నిర్మాణంలోనే ఉంటాయని తెలుస్తుంది.

అందులో ఒకటి పూరి కొడుకునే పెట్టి సినిమా చేస్తాడట ఈసారి మార్షల్ ఆర్ట్స్ తో ఈ సినిమా ఉంటుందట. సినిమా మొత్తం యూఎస్ లో షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని అంటున్నారు. ఇక మరోపక్క తమ్ముడు సాయిరాం శంకర్ తో కూడా పూరి ఓ మూవీ ప్లాన్ చేశాడట. ఈ రెండు సినిమాలకు తాను కూడా ఒక నిర్మాతగా ఉంటున్నాడట. మొత్తానికి పూరి మళ్లీ సొంత ప్రయత్నంతో మూవీ చేస్తున్నాడు. మరి పూరి మార్క్ సినిమాగ వచ్చి ఈ రెండిటిలో ఒకటైనా హిట్ కొడుతుందో లేదో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష