రేణుదేశాయ్ కు తోడు దొరికింది..!

June 16, 2018


img

పవన్ కళ్యాణ్ నుండి విడిపోయాక పిల్లలతో పూణేలో పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రేణు దేశాయ్ ఇంతకుముందే తాను ఓ తోడు కోసం వెతుకుతున్నట్టు తెలిపింది. పవన్ తో విడిపోయాక ఆమె మళ్లీ పెళ్లి చేసుకునేందుకు చాలా టైం తీసుకుంది. అప్పట్లో ఈ విషయంపై పవన్ ఫ్యాన్స్ ఆమెను విమర్శించినా వారికి సరైన ఆన్సర్ చెప్పింది రేణు దేశాయ్. ఇక ఇప్పుడు ఎట్టకేలకు తన తోడు దొరికేసిందని ఇన్ స్టాగ్రాం లో ఓ పిక్ పెట్టి సర్ ప్రైజ్ ఇచ్చింది.


ఇన్నాళ్లు స్వచ్చమైన ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికాను.. ఎట్టకేలకు నా ప్రేమను నీలో చూస్తున్నాను.. నా చేయి ఇలానే పట్టుకో.. ఎప్పటికి విడిచిపెట్టొద్దు అంటూ ఓ ఎమోషనల్ మెసేజ్ పెట్టింది రేణు దేశాయ్. అయితే అతనెవరు అన్నది మాత్రం రివీల్ చేయలేదు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న రేణు దేశాయ్ కు ఎంతోమంది తమ శుభాకాంక్షలు చెబుతున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష