రజినితో లక్కీ ఛాన్స్..!

June 16, 2018


img

యువ హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్న సూపర్ స్టార్ రజినికాంత్ కాలా తర్వాత ఏమాత్రం లేటు చేయకుండా మరో సినిమాలు సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. పిజ్జా ఫేం కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. రజినితో కాజల్ లక్కీ ఛాన్స్ పట్టేసింది.

కెరియర్ దాదాపు అయిపోయింది అనుకున్న టైంలో అవకాశాలను అందుకున్న కాజల్ మళ్లీ ఫాంలోకి వచ్చింది. క్రేజీ హీరోయిన్స్ లో కాజల్ నంబర్ 1గా ఉందని చెప్పొచ్చు. అందుకే రజినికాంత్ సరసన ఛాన్స్ పట్టేసింది. రజిని సినిమాలో చిన్న రోల్ చేసిన చాలు అనుకునే కాజల్ ఏకంగా హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ కొట్టేసింది. చూస్తుంటే మరో ఐదారేళ్ల దాకా కాజల్ కెరియర్ కు ఎలాంటి ఢోకా లేదని చెప్పొచ్చు.    



Related Post

సినిమా స‌మీక్ష