సంక్రాంతికి వస్తున్న చరణ్..!

June 16, 2018


img

రంగస్థలం హిట్ తో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కియరా అద్వాని నటిస్తుంది. 

ఊర మాస్ సినిమాలను తీయడంలో తనకు తానే సాటి అనిపించుకునే బోయపాటి శ్రీను రాం చరణ్ తో ఎలాంటి సినిమా అందిస్తాడో అని మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ప్రశాంత్ కూడా నటిస్తున్నాడు. పొంగల్ వార్ లో ముందు కర్చీఫ్ వేసిన మెగా పవర్ స్టార్ కచ్చితంగా సూపర్ హిట్ కొడతాడని చెప్పొచ్చు. 



Related Post

సినిమా స‌మీక్ష