జెర్సీ టైటిల్ తో నాచురల్ స్టార్..!

June 15, 2018


img

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. టైటిల్ రివీల్ చేసిన ఈ సినిమాలో నాని ధరించే జెర్సీని చూపించారు. ఇట్స్ నెవర్ టూ లేట్ టూ డ్రీం ట్యాగ్ తో వస్తుంది. కచ్చితంగా నాని ఓ కొత్త ప్రయత్నమే చేస్తున్నాడని చెప్పొచ్చు.   


సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీ రావా సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చూపించిన గౌతం.. నానితో చేస్తున్న సినిమా జెర్సీ. ప్రస్తుతం నాగార్జునతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్న నాని ఆ సినిమాతో పాటుగా ఈ జెర్సీ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసేలా చూస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ఈ ఇయర్ కృష్ణార్జున యుద్ధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ అందుకోలేదు. 



Related Post

సినిమా స‌మీక్ష