రజినిని మెప్పించిన మురుగదాస్..!

June 15, 2018


img

ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అయ్యాక కాని కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి మరో సినిమా చేసే రజినికాంత్ ఈమధ్య మరింత స్పీడ్ పెంచాడు. కాలా రిలీజ్ కాకముందే కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో సినిమా షురూ చేశాడు. కాలా వచ్చింది రజిని సత్తా చాటింది. తెలుగులో రిజల్ట్ ఎలా ఉన్నా కోలీవుడ్ లో కాలా సూపర్ హిట్ బొమ్మే. 2.ఓ ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే మరో సినిమా లైన్ లో పెట్టాడు రజిని.

ఎన్నాళ్ల నుండో రజినితో సినిమా చేయాలనుకుంటున్న క్రేజీ డైరక్టర్ మురుగదాస్ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రజిని. ఈమధ్యనే స్టోరీ డిస్కషన్స్ జరిగాయట. మురుగ చెప్పిన కథకు రజిని కొన్ని సలహాలిచ్చాడట. ఫైనల్ గా రజిని, మురుగా సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఓ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమా నిర్మిస్తుందని అంటున్నారు. 

సౌత్ లో లీడింగ్ డైరక్టర్స్ లో మురుగదాస్ ఒకరు. బాలీవుడ్ లో కూడా ఆ దర్శకుడికి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం విజయ్ తో సినిమా చేస్తున్న మురుగదాస్ అది పూర్తి చేశాక రజిని సినిమా చేస్తాడట.



Related Post

సినిమా స‌మీక్ష