వైఎస్ బయోపిక్ లో సీనియర్ హీరోయిన్..!

June 14, 2018


img

జననేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా యాత్ర టైటిల్ తో మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. మహి వి రాఘవ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వైఎస్సార్ గా మళయాల మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్ అధికారంలోకి వచ్చేందుకు ముఖ్య పాత్ర పోశించిన పాదయాత్ర ఎపిసోడ్ ఇందులో ముఖ్యంగా ప్రస్థావించడం జరుగుతుంది. అందుకే సినిమా టైటిల్ గా యాత్ర అని పెట్టారు.  

ఇక సినిమాలో వైఎస్ విజయమ్మగా బాహుబలి ఫేమ్ అశిత్ర నటిస్తుందని తెలుస్తుండగా వైఎస్ సిఎంగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న సబిరా ఇంద్రారెడ్డి పాత్రలో సీనియర్ హీరోయిన్ సుహాసిని కనిపిస్తుందట. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా సబిరా ఇంద్రా రెడ్డి అప్పట్లో ఓ వెలుగు వెలిగారు ఆ పాత్ర కోసం సుహాసినిని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. 30 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష