రాం చరణ్ గ్యాంగ్ లీడర్..!

June 13, 2018


img

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో గ్యాంగ్ లీడర్ ఒకటి. 1991లో వచ్చిన ఆ సినిమా మెగాస్టార్ క్రేజ్ ను రెండింతలు చేసింది. మెగా వారసుడిగా రాం చరణ్ ఆ టైటిల్ తో సినిమా తీయాలని కొన్నాళ్లుగా చూస్తున్నాడు. కథ కూడా దాదాపుగా అదేలా ఉండేలా చూస్తున్నారట. కొన్నాళ్ల నుండి ఈ వార్త వినిపిస్తున్నా కన్ఫాం చేసిన వారు మాత్రం లేరు. ఫైనల్ గా చిరంజీవే ఈమధ్య జరిగిన ఓ ఆడియో వేడుకలో అది కన్ఫాం చేశారు. 

కె.ఎస్ రామారావు నిర్మాణంలో తాను ఎన్నో సూపర్ హిట్లు కొట్టానని.. రాం చరణ్ కూడా ఓ సినిమా చేస్తాడని మాటిచ్చారు చిరు. తేజ్ ఐలవ్యూ సినిమా ఆడియో వేడుకలో చిరు ఈ విషయం వెళ్లడించారు. అది కచ్చితంగా గ్యాంగ్ లీడర్ సినిమా కోసమే అంటున్నారు కొందరు. కె.ఎస్ రామారావు ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఇక దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. గ్యాంగ్ లీడర్ గా రాం చరణ్ వస్తే ఇక మరోసారి రికార్డులతో చెడుగుడు ఆడేయడం ఖాయం.   Related Post

సినిమా స‌మీక్ష