పవన్ తో ఈక్వల్ గా నాని..!

June 13, 2018


img

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో పవన్ ఒకరు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ తో ఈక్వల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు నాచురల్ స్టార్ నాని. పవన్ ఎక్కడ నాని ఎక్కడ అసలు వారిద్దరికి పొంతన లేదు కదా అనుకోవచ్చు. అయినా పవన్ తర్వాత మిగతా వారంతా ఉన్నారు కదా అంటే పవన్ తో ఈక్వల్ ఫాలోయింగ్ ఉన్నది ట్విట్టర్ లో అని తెలుస్తుంది.

ట్విట్టర్ ఫాలోవర్స్ లో ఎన్.టి.ఆర్ 2.34 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. అల్లు అర్జున్ 2.53 మిలియన్స్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ 3.05 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. వీరితో పాటుగా నానిని కూడా 3 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. ఎన్.టి.ఆర్, బన్నిలను దాటి నాని పవన్ కు దగ్గరగా చేరాడు. ఇక టాలీవుడ్ లో మాత్రం మహేష్ 6.61 మిలియన్ ఫాలోవర్స్ తో టాప్ ప్లేస్ లో ఉన్నాడు.Related Post

సినిమా స‌మీక్ష