సైరా కోసం హాలీవుడ్ ఫైట్ కంపోజర్..!

June 13, 2018


img

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈమధ్యనే యాక్షన్ పార్ట్ మొదలుపెట్టిన ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సెస్ ను హాలీవుడ్ యాక్షన్ కంపోజర్ గ్రేగ్ పావెల్ కంపోజ్ చేస్తున్నారట. హాలీవుడ్ సినిమాలకు క్రేజీ యాక్షన్ కంపోజర్ గా పేరు తెచ్చుకున్న గ్రేగ్ పావెల్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6, స్కై పాల్, హ్యారీ పోర్టర్ వంటి సినిమాలకు ఫైట్స్ కంపొజ్ చేశాడు.

జేమ్స్ బాండ్ యాక్షన్ కంపోజర్ తెలుగు సినిమా కోసం పనిచేయడం నిజంగా గొప్ప విషయమని చెప్పొచ్చు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు లాంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2019 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష