ఫిదా భామకు అప్పుడే పెళ్లా..!

June 13, 2018


img

మళయాల ప్రేమం సినిమాతో సౌత్ ప్రేక్షకులను అలరించి తెలుగులో ఫిదాతో అలరించిన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు అప్పుడే పెళ్లికి సిద్ధమైందని తెలుస్తుంది. ఫిదా భామకు అప్పుడే పెళ్లా.. వినేందుకు సాయి పల్లవి ఫ్యాన్స్ కు ఇది చేదుగా అనిపించినా ఇది నిజమని తెలుస్తుంది. దక్షిణాదికి చెందిన ఓ మినిస్టర్ కొడుకు సాయి పల్లవిని ప్రేమించాడట. 

ఆమెను అతను డైరెక్ట్ గా ఆ విషయం చెప్పడం ఆమె నో చెప్పడం జరిగిందట. అయితే ఈసారి మినిస్టర్ ను పంపించి సాయి పల్లవి పేరెంట్స్ తో మాట్లాడించాడట. ఏకంగా మినిస్టర్ వచ్చి కూతురు పెళ్లి సంబంధం గురించి మాట్లాడే సరికి సాయి పల్లవి తల్లిదండ్రులు ఓకే చెప్పేశారట. ప్రస్తుతం కమిట్ అయిన రెండు, మూడు సినిమాలు ఫినిష్ చేసి సాయి పల్లవి పెళ్లికి రెడీ అవుతుందట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది అఫిషియల్ గా తెలియాల్సి ఉంది.   Related Post

సినిమా స‌మీక్ష