మ్యాటర్ సెటిల్ చేసిన మహేష్..!

June 12, 2018


img

భరత్ అనే నేను తర్వాత సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అసలైతే పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మించాలి. అది కాస్త దిల్ రాజు, అశ్వనిదత్ చేతుల్లోకి వచ్చింది. ఈ సినిమా తన బ్యానర్ లో చేయనందుకు సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి మీద కేసు కూడా వేశాడు పివిపి. అయితే దిల్ రాజు జోక్యంతో వ్యవహారం సర్ధుమనిగిందని అన్నారు. మళ్లీ పివిపి గొడవ మొదలు పెట్టడంతో ఈసారి మహేష్ కలుగచేసుకున్నాడట.

పివిపితో మంచి సన్నిహిత్యం ఉన్న మహేష్ తనకు కొంత డబ్బు ఇచ్చి ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడని టాక్. బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవడం వల్ల వంశీ పైడిపల్లి సినిమా పివిపి నిర్మాణంలోనే చేస్తా అని మాటిచాడు మహేష్. ఇప్పుడు ఆ సినిమా దిల్ రాజు, అశ్వనిదత్ లు టేకప్ చేశారు. సినిమా తన చేతుల నుండి మిస్సైన బాధలో ఉన్న పివిపికి మహేష్ సపోర్ట్ గా నిలిచాడని తెలుస్తుంది. సినిమా మరో వారంలో సెట్స్ మీదకు వెళ్తుంది కాబట్టి ఈ మ్యాటర్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు.Related Post

సినిమా స‌మీక్ష