మెగా ఛాన్స్ పట్టేసిందట..!

June 12, 2018


img

రియల్ లైఫ్ లో కిక్ బాక్సర్ అయిన రితికా సింగ్ ఇరుదు సుత్రు సినిమాతో హీరోయిన్ గా పరిచమైంది. ఆ సినిమలో బాక్సర్ గా దుమ్మురేపింది. అదే సినిమా తెలుగులో రీమేక్ చేయగా తన పాత్రలో తానే చేసింది రితిక సింగ్. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకున్నా కోలీవుడ్ లో శివలింగ, ఆండావన్ కట్టలై సినిమాలు చేసింది ఈ అమ్మడు. హీరోయిన్స్ అంటే గ్లామర్ షో అవసరమని త్వరగా గుర్తించిన రితిక ఈమధ్య స్లిమ్ లుక్ లో హాట్ స్టిల్స్ ఇస్తుంది.

లేటెస్ట్ గా అమ్మడికి టాలీవుడ్ నుండి లక్కీ ఛాన్స్ వచ్చిందట. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా రితిక సింగ్ సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. చిత్రలహరి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా చిత్ర పరిశ్రమ గురించి ఉంటుందని తెలుస్తుంది. నాని కాదన్న ఈ సినిమా తేజూ మెచ్చి చేస్తున్నాడు. కచ్చితంగా ఈ మెగా ఆఫర్ అమ్మడి కెరియర్ కు మంచి బూస్టప్ ఇస్తుందని చెప్పొచ్చు.  Related Post

సినిమా స‌మీక్ష