బిగ్ బాస్-2 లో ఆమెకే హయ్యెస్ట్ రెమ్యునరేషన్..!

June 12, 2018


img

నాని హోస్ట్ గా బిగ్ బాస్ సెకండ్ సీజన్ మొదలైంది. 16 మంది కంటెస్టంట్స్ లో ఆడియెన్స్ కు తెలిసిన వారు మాత్రం కొందరే అని చెప్పొచ్చు. ఇక ఈ 16 మంది కంటెస్టంట్స్ లో ఎక్కువ పారితోషికం తీసుకున్నది ఎవరు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. హౌజ్ లో ఉన్న వారిలో డేట్స్ సమస్య వచ్చే వారు ఎవరు లేరు. అయితే ఉన్న వారిలో మాత్రం సింగర్ గీతా మాధురి కాస్త బిజీ అని చెప్పొచ్చు.

హౌజ్ లో 3 నెలలు ఉండాలి కాబట్టి ఈ 100 రోజుల్లో తనకు సింగింగ్ అవకాశాలు వచ్చినా మిస్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే గీతా మాధురి బిగ్ బాస్ హౌజ్ లో ఉండేందుకు భారీ రెమ్యునరేషనే తీసుకుందట. అయితే హౌజ్ లో కొందరు వారాల లెక్కగా పారితోషికం తీసుకుంటుండగా గీతా మాధురి మాత్రం మొదటి వారం నామినేట్ అయినా లేక 100 రోజులు ఉన్నా 20 లక్షల పారితోషికంగా పొందుతుందట. తను బయట ఉన్నా కచ్చితంగా ఈ మూడు నెలల్లో పాటలు పాడి ఆ మొత్తాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. మరి దీని వల్ల ఆమెకేం లాభం అంటే.. ఒకవేల బిగ్ బాస్ విన్నర్ గా గెలిస్తే మాత్రం ఆ అమౌంట్ కూడా ఆమెకు బోనస్ అన్నమాట. అలా బిగ్ బాస్ లో గీతా మాధురి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.      Related Post

సినిమా స‌మీక్ష