అందులో అందరు.. ఇందులో ఇద్దరు.. జంబలకిడి పంబ ట్రైలర్..!

June 12, 2018


img

ఈవివి సత్యనారాయణ డైరక్షన్ లో వచ్చిన క్రేజీ మూవీస్ లో జంబలకిడి పంబ ఒకటి. అప్పట్లో సంచలన విజయం అందుకున్న ఆ సినిమా టైటిల్ తో కొద్దిపాటిగా అదే కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా జంబలకిడి పంబ. శ్రీనివాస్ రెడ్డి, సిద్ది ఇద్నాని లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాను మురళి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.

ట్రైలర్ లో టైటిల్ కు తగినట్టుగా హీరో చేయాల్సింది హీరోయిన్.. హీరోయిన్ చేయాల్సింది హీరో చేస్తుంటాడు. కాన్సెప్ట్ కొత్తగా ఉందనిపిస్తున్న ఈ సినిమా టైటిల్ కూడా పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యేలా చేశారు. జూన్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈవివి జంబలకిడి పంబలో అందరు మగవాళ్లు ఆడవాళ్లలా.. ఆడవాళ్ళు మగవాళ్ళలా ప్రవర్తిస్తారు. కాని ఇందులో మాత్రం కేవలం హీరో, హీరోయిన్ మాత్రమే అలా చేస్తారు మరి దానికి కారణాలేంటి అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. 

Related Post

సినిమా స‌మీక్ష