అభిమన్యుడు రివ్యూ & రేటింగ్

June 01, 2018


img

రేటింగ్ : 2.75/5

కథ :

మిలటరీ ఆఫీసర్ అయిన కరుణాకర్ (విశాల్) తన కోపం వల్ల సస్పెండ్ అవుతాడు. తన కళ్ల ముందు ఎలాంటి అన్యాయం జరిగినా సహించలేని కరుణాకర్ సస్పెండ్ కారణంగా తన ఊరికి వెళ్తాడు. తన కోపాన్ని తగ్గించుకునేందుకు డాక్టర్ లతాదేవి (సమంత) సహాయం తీసుకుంటాడు. ఇక సొంత ఊరికి వెళ్లిన కరుణ తన చెల్లి ప్రేమించిన అతనికి ఇచ్చే పెళ్లి చేయాలని చూస్తాడు. పెళ్లి కోసం ఊళ్లో ఆస్తి అమ్మేసి 4 లక్షలు సిద్ధం చేస్తాడు. ఇక మిగతా 6 లక్షలు లోన్ తీసుకుంటాడు. అయితే తన ఖాతాలో ఉన్న 10 లక్షలు ఒకేసారి మాయమవుతాయి. వైట్ డెవిల్ (అర్జున్) ఇలాంటి అక్రమాలు చేస్తాడు. తన డబ్బు పోగొట్టుకున్న కరుణాకర్ వైట్ డెవిల్ మీద ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే సినిమా.

విశ్లేషణ :

మనం నిత్యం రోజు టీవీల్లో, పేపర్లో జరిగే సైబర్ క్రైం నేపథ్యంలోనే ఈ సినిమా వచ్చింది. దర్శకుడు మిత్రన్ కథ, కథనాలను చాలా క్లీన్ గా రాసుకున్నాడు. సినిమాలో ఆడియెన్స్ త్వరగా ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు. ఇక హీరో, విలన్ ల మధ్య ఎత్తుకు పై ఎత్తులు సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తాయి.

విలన్ రేంజ్ ను బట్టి హీరో కూడా ఉంటాడని ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. వైట్ డెవిల్ గా అర్జున్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాకు అతని పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇక దర్శకుడు సైబర్ క్రైం నేరాల మీద పూర్తిగా పరిశోధన చేస్తి ఈ కథ రాసుకున్నాడని చెప్పొచ్చు. కథనం కూడా ఎక్కడ అనవసర విషయాలను ప్రస్థావించలేదు.

ఇక పనిలో పనిగా ప్రభుత్వాల మీద, విజయ్ మాల్యా స్కాం, ఏటిఎమ్ ల గురించి కూడా డైలాగులతో దంచేశాడు విశాల్. సినిమా చూసిన ఆడియెన్ హీరో పాత్రలో తనని ఊహించుకుంటాడు. అంతేకాదు ఈసారి మన డేటా ఎవరికైనా ఇచ్చేముందు భయపడతారు. సైబర్ క్రైం నేపథ్యంలో అభిమన్యుడు ప్రేక్షకులు మెప్పు పొందిందని చెప్పొచ్చు.  

నటన, సాంకేతిక వర్గం :

సినిమాలో కరుణాకర్ గా విశాల్ మంచి నటన కనబరిచాడు. తమిళంలో ఆల్రెడీ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ కోసం డబ్ చేసి రిలీజ్ చేశారు. హీరోయిన్ గా సమంత మంచి పాత్రే చేసింది. విలన్ గా అర్జున్ అదరగొట్టాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

టెక్నికల్ టీం విషయానికొస్తే.. జార్జ్ సి విలియంస్ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. కెమెరా వర్క్ ప్రతి ఫ్రేం లో కనిపిస్తుంది. దర్శకుడు అనుకున్న కథకు సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించాడు. రుబెన్ ఎడిటింగ్ ఓకే అయితే అక్కడక్కడ కాస్త సాగదీసిన భావన కలుగుతుంది. దర్శకుడు మిత్రన్ కథ, కథనాలు చాలా అద్భుతంగా రాసుకున్నాడు. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసినట్టు తెరమీద కనిపిస్తుంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. 

ఒక్కమాటలో :

సైబర్ క్రైం ఆటకట్టే అభిమన్యుడు.. ప్రేక్షకులను మెప్పించాడు..!



Related Post

సినిమా స‌మీక్ష