వర్మ కోసం వారిద్దరూ..!

May 26, 2018


img

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో కింగ్ నాగార్జున హీరోగా వస్తున్న క్రేజీ మూవీ ఆఫీసర్. జూన్ 1 న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సోమవారం జరుగనుంది. ఇక ఈ వేడుకకు చీఫ్ గెస్టులుగా రాజమౌళి, సుకుమార్ వస్తున్నారని తెలుస్తుంది. శివతో సంచలన దర్శకుడిగా తన ప్రతిభ చూపిన ఆర్జివి నాగార్జునతో సరిగ్గా పాతికేళ్ల తర్వాత చేసిన సినిమా ఆఫీసర్. ఈ సినిమాకు వర్మ దర్శకుడే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

ఈమధ్య వరుస ఫ్లాపులను తీస్తున్న వర్మ ఒకేసారి నాగ్ తో సినిమా అనగానే అందరు ఆశ్చర్యపడ్డారు. నాగార్జున ఎలా వర్మకు ఛాన్స్ ఇచ్చాడని అనుకున్నారు. అఫీసర్ సినిమాలో నాగార్జున ఎంకౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా సినిమా ప్రమోషన్స్ గురించి పట్టించుకోని వర్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి, సుకుమార్ లను పిలవడంతో సినిమాపై అందరు ఫోకస్ పెడుతున్నారు. ఇలా వచ్చిన క్రేజ్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా చేయొచ్చనే ఆలోచన ఇదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష