ఆ కేసు నుండి బాబి బయటపడ్డట్టేనా..!

May 26, 2018


img

పవర్ సినిమాతో దర్శకుడిగా టాలెంట్ ప్రూవ్ చేసుకున్న కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి రచయితగా తనకున్న అనుభవాన్ని అంతా ఏర్చి కూర్చి హిట్లు కొడుతున్నాడు. లాస్ట్ ఇయర్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేసిన జై లవ కుశ సూపర్ హిట్ అవడంతో బాబికి సూపర్ క్రేజ్ వచ్చింది. అయితే ఈ నెల 20న అర్ధరాత్రి హర్మీందర్ సింగ్ కారుని యాక్సిడెంట్ చేసిన కేసులో బాబికి షాక్ తగిలింది. దీనిపై హర్మీందర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. కారుని గుద్ది ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా వెళ్లాడని బాబి మీద హర్మీందర్ కేసు పెట్టాడు.

అయితే ఈ విషయం పెద్దది అవుతుండటంతో బాబి బుధవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన తప్పుని అంగీకరించాడు. అంతేకాదు నిన్న ఉదయం హర్మీందర్ సింగ్ ఇంటికి వెళ్లి అతనికి క్షమాపణలు చెప్పాడట. ఈ విషయాన్ని చెబుతూ హర్మీందర్ సింగ్ తన ఫేస్ బుక్ లో ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు. బాబి తన ఇంటికి వచ్చి క్షమాపణలు కోరాడని.. తన మదర్ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారని అన్నాడు. ఇక తనకు జరిగిన అన్యాయం పట్ల సపోర్ట్ గా నిలిచిన మీడియా, స్నేహితులకు థ్యాంక్స్ చెప్పాడు బాబి. తన సమస్యకు సరైన న్యాయం జరిగిందని అనుకుంటున్నాడట. మొత్తానికి బాబి ఈ గొడవ నుండి బయటపడ్డట్టే అంటున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష