బాబాయ్ పిలిస్తే నేను రెడీ..!

May 25, 2018


img

రంగస్థలంతో సూపర్ హిట్ అందుకున్న రాం చరణ్ చిట్టిబాబుగా తన నట విశ్వరూపం చూపించాడు. ఇక ఈ సినిమా సక్సెస్ లో మీడియా పాత్ర గురించి ప్రస్థావించేందుకు మీడియాతో ఇంటరాక్షన్ ఏర్పరచుకున్నాడు రాం చరణ్. ఇక ఈ మీటింగ్ లో చరణ్ హీరోల మధ్య పోటీ గురించి స్టార్ ఫ్యాన్స్ వార్ గురించి తమ మధ్య రికార్డుల ప్రస్థావనే రాదని చెప్పాడు.

ఇక బాబాయ్ జనసేన పార్టీ గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడిన చరణ్ బాబాయ్ పిలిస్తే తాను జనసేన తరపున ప్రచారం చేసేందుకు రెడీ అంటున్నాడు. తన తండ్రి కాంగ్రెస్ లో ఉన్నా తమ సపోర్ట్ బాబాయ్ కు ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు చరణ్. ఇక 2009లో పి.ఆర్.పికి తమ ప్రచారం అవసరం లేకుండా బాబాయే మొత్తం చూశారని. ఇప్పుడు బాబాయ్ జనసేన తరపున తనని ప్రచారం చేయమంటే తప్పకుండా చేస్తామని చెప్పాడు చరణ్. చూస్తుంటే ఈసారి మెగా హీరోలంతా జనసేనకు అండగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  



Related Post

సినిమా స‌మీక్ష