నేల టిక్కెట్టు సేఫ్ బిజినెస్..!

May 24, 2018


img

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా నేల టిక్కెట్టు. ఎస్.ఆర్.టి మూవీస్ బ్యానర్లో తాళ్లూరి రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. టీజర్, ట్రైలర్ లతో హంగామా చేస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా బిజినెస్ లెక్కలు చూస్తే చాలా సేఫ్ జోన్ లో వెళ్లినట్టు తెలుస్తుంది. 

దాదాపు 30 కోట్ల దాకా మార్కెట్ చేయగలిగే కేపబిలిటీ ఉన్నా సరే రవితేజ నేల టిక్కెట్టు సినిమా కేవలం 22.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రవితేజ ఇమేజ్ ప్రకారం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా చాలు డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయినట్టే. రవితేజ రీసెంట్ మూవీ టచ్ చేసి చూడు సినిమా 27 కోట్ల పైగా ప్రీ రిలీజ్ చేసినా రిటర్న్స్ విషయంలో చాలా దెబ్బపడింది. అందుకే ఈసారి రవితేజ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు.



Related Post

సినిమా స‌మీక్ష