రామ్ సినిమా డిఎస్పి ఉన్నాడట..!

May 24, 2018


img

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో గురు ప్రేమకోసమే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు అసలైతే ముందు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనుకున్నా డిఎస్పితో దర్శక నిర్మాతలకు పడక ఆ సినిమా నుండి ఎక్సిట్ అయ్యాడని టాక్ వచ్చింది. దేవి ప్లేస్ లో తమన్ ఆ సినిమా ఛాన్స్ అందుకున్నాడని వార్తలు వచ్చాయి.

అయితే ఏమైందో ఏమో కాని మళ్లీ డిఎస్పినే ఆ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత సినిమా కాదని చెబితే ఎలా అనుకున్నాడో ఏమో కాని డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని మరి దేవి ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదవరకు త్రినాథరావు డైరక్షన్ లో వచ్చిన నేను లోకల్ సినిమా కూడా దేవి మ్యూజిక్ తో వచ్చింది. ఆ హిట్ సెంటిమెంట్ కోసమే దిల్ రాజు కూడా దేవిని కావాలని పట్టుపట్టాడట. జగడం తర్వాత దేవి రామ్ కలిసి సినిమా చేయలేదు చాన్నాళ్ల తర్వాత నేను శైలజతో మళ్లీ వారు కలిసి పని చేశారు. రామ్ రీసెంట్ మూవీ ఉన్నది ఒకటే జిందగి సినిమాకు దేవినే మ్యూజిక్ అందించాడు. 



Related Post

సినిమా స‌మీక్ష