సింహా కాంబో రిపీట్..!

May 22, 2018


img

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. కెరియర్ పరంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న బాలకృష్ణకు సింహా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వచ్చిన లెజెండ్ కూడా బోయపాటి డైరక్షన్ లో వచ్చి హిట్ కొట్టింది. బాలకృష్ణ 100వ సినిమా టైంలోనే బోయపాటి శ్రీను బాలకృష్ణ కలిసి సినిమా చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ పై దృష్టి పెట్టగా బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా చేస్తున్నాడు. ఇద్దరు వారు కమిట్ అయిన సినిమాలు పూర్తి చేశాక కలిసి సినిమా చేస్తారని తెలుస్తుంది. అయితే వినాయక్ డైరక్షన్ లో కూడా బాలయ్య ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మరి ఆ సినిమా ముందు బోయపాటి సినిమా వెనక్కి వెళ్తుందా అన్నది తెలియాల్సి ఉంది. 



Related Post

సినిమా స‌మీక్ష