దిల్ రాజు నుండి లాక్కున్న దత్తుగారు..!

May 22, 2018


img

వైజయంతి బ్యానర్ లో సినిమా అంటే ఆ సినిమా రేంజ్ వేరేల ఉండేది. శక్తి తర్వాత సినిమా నిర్మాణానికి కాస్త దూరంగా ఉన్న అశ్వనిదత్ మహానటి సినిమాతో మళ్లీ తన బ్యానర్ వాల్యూ ఏంటో చూపించారు. ఇక ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహేష్ హీరోగా వస్తున్న సినిమాకు దిల్ రాజుతో పాటుగా అశ్వనిదత్ నిర్మాత అని అంటున్నారు. కేవలం మహేష్ డేట్స్ ఉన్నాయి కాబట్టే అశ్వనిదత్ ఈ సినిమాకు సమర్పకుడిగా ఉండాలని భావించారు.

కాని మహానటి సినిమా హిట్ అవడంతో మనసు మార్చుకుని దిల్ రాజు నుండి ఈ సినిమా సగం నిర్మాణ బాధ్యతలను అశ్వనిదత్ తీసుకుంటున్నారట. దీనికి దిల్ రాజు నుండి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తుంది. ఊపిరి తర్వాత వంశీ పైడిపల్లి రెండేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. భరత్ అనే నేను సక్సెస్ తర్వాత మహేష్ చేస్తున్న తన 25వ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు.



Related Post

సినిమా స‌మీక్ష