షర్మిల పాత్రలో భూమిక కన్ఫాం..!

May 21, 2018


img

వైఎస్సార్ బయోపిక్ గా మహి వి రాఘవ్ డైరక్షన్ లో యాత్ర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి వై.ఎస్.ఆర్ గా నటిస్తుండగా బాహుబలి సినిమాలో నటించిన అశ్రిత విజయమ్మగా నటించబోతుంది. ఇక ఈ సినిమాలో జగన్, షర్మిల పాత్రలకు ప్రాధాన్యత ఉంది. జగన్ పాత్రలో సూర్య నటిస్తున్నాడని వార్తలు రాగా చిత్రయూనిట్ దాన్ని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. 

ఇక ఈ సినిమాలో షర్మిలగా ఒకప్పటి హీరోయిన్ భూమిక నటిస్తున్నట్టు తెలుస్తుంది. పవన్, మహేష్, ఎన్.టి.ఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన భూమిక కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం అక్క, వదిన పాత్రలు చేస్తున్న భూమిక షర్మిలగా నటిస్తుందని తెలుస్తుంది. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా హిట్ అవడంతో రాబోతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ఎన్.టి.ఆర్, యాత్ర సినిమాలకు మంచి క్రేజ్ వచ్చింది. మరి ఇవి అంచనాలను అందుకునేలా ఉంటాయా లేదా అన్నది చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష