టాక్సీ వాలా రిలీజ్ డేట్ ఫిక్స్..!

May 21, 2018


img

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న టాక్సీ వాలా సినిమా పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు. షూటింగ్ పూర్తగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా అసలైతే మే సెకండ్ వీక్ రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడ్డది. టాక్సీ వాలా ఫస్ట్ గేర్.. హీరో ఇంట్రో రెండు ప్రోమోలు సూపర్ హిట్ అవగా ఈ సినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

జూన్ 14న టాక్సీ వాలా రిలీజ్ ఫిక్స్ చేశారు. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మించారు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా పోస్టర్స్ క్రేజ్ తెచ్చుకోగా ఫైనల్ గా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష