ఆరెక్స్ 100 ట్రైలర్.. ఘాటుగా తాజాగా..!

May 21, 2018


img

అర్జున్ రెడ్డి సినిమా స్పూర్తితో కొత్త ప్రయోగాలు చేసేందుకు అవకాశం దొరికింది. ఒక మంచి కథను ప్రేక్షకులకు చేరవేసే క్రమంలో కొంత బోల్డ్ అటెంప్ట్ కూడా సహకరిస్తుందని అర్జున్ రెడ్డి సినిమా ప్రూవ్ చేసింది. ఇక ఇప్పుడు అదే దారిలో వస్తున్న సినిమా ఆరెక్స్ 100. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కర్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ చేశారు. 

రావు రమేష్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రాంకీ నటించడం విశేషం. ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి కలిగేలా చేసిన ఈ ఆరెక్స్ 100 ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమాలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. కావాల్సినన్ని హాట్ సీన్స్ తో ట్రైలర్ మాత్రం అదరగొట్టారు. మరి సినిమా కూడా ఈ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.





Related Post

సినిమా స‌మీక్ష