ఇల్లి బేబ్ కు టాలీవుడ్ ఛాన్స్..?

May 21, 2018


img

గోవా బ్యూటీ ఇలియానాకు ఎట్టకేలకు టాలీవుడ్ నుండి లక్కీ ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మాస్ మహరాజ్ రవితేజ డైరక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇలియానా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. అను ఇమ్మాన్యుయెల్ ప్లేస్ లో ఇల్లి బేబ్ ఛాన్స్ కొట్టేసిందట. సినిమా ముహుర్తానికి హాజరైన అను ఇమ్మాన్యుయెల్ తెలుగులో కెరియర్ అంత సాటిస్ఫైడ్ గా లేకపోవడంతో ఈ సినిమా నుండి ఏవో కారణాలు చెప్పి తప్పుకుందట.

రవితేజ ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఇలియానాతో పాటుగా కాజల్ అగర్వాల్, శృతి హాసన్ కూడా నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ, దుబాయ్ శ్రీను సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను కూడా వాటి సరసన నిలబెట్టాలని చూస్తున్నారు. ఈమధ్య వరుస ఫ్లాపులతో కాస్త వెనుకపడ్డ శ్రీను వైట్ల ఈ సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఇక రాక రాక వచ్చిన ఈ ఛాన్స్ ను ఇలియానా కూడా మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.



Related Post

సినిమా స‌మీక్ష