అరవింద సమేత ఎన్టీఆర్..!

May 19, 2018


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం క్రేజీ కాంబినేషన్ లో సెట్స్ మీద ఉన్న సినిమా టైటిల్ గా అసమాన్యుడు అన్నది ప్రచారంలో ఉంది. ఈరోజు సాయంత్రం ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తారు ఈలోగా మీడియా సర్కిల్స్ లో ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ హంగామా సృష్టిస్తుంది అరవింద సమేత రాఘవ. త్రివిక్రం మార్క్ కనిపిస్తున్న ఈ టైటిల్ చూస్తే మళ్లీ మాటల మాంత్రికుడు ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నాడనిపిస్తుంది.

అజ్ఞాతవాసి తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా చేస్తున్న త్రివిక్రం సినిమా అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా చూస్తున్నాడట. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, శ్రద్ధా కపూర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అరవింద్ సమేత రాఘవ టైటిల్ వింటేనే చాలా ప్లెసెంట్ గా అనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష